- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు కుప్పంలో గుండాగిరి చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో గుండాగిరి రాజకీయాలు చేస్తున్నారని.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ, గుండాగిరి రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరని విమర్శించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంపై తెలుగుదేశం నాయకులు దాడి చేశారన్నారు.
కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ప్రజల సానుభూతి కోసం అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబును కుప్పం ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story