- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు తెలంగాణే లక్ష్యం: మంత్రి నిరంజన్‌రెడ్డి
దిశ, మహబూబ్ నగర్: బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తిలోని ఆయన నివాసంతో పాటు రాజాపేట శివారులోని జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో మాదిరిగానే పునర్నిర్మాణంలోనూ మన విధిని నిర్వహిద్దామని, టీఆర్ఎస్ జెండా, ఎజెండా నాడు రాష్ట్ర సాధనైతే.. నేడు రాష్ట్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. నూతన రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్లలో ఇంత ప్రగతిని సాధించిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. కేసీఆర్ పాలన, నిర్ణయాలు, పథకాలు దేశానికి దిక్సూచిలాంటివన్నారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, వందశాతం పంటల కొనుగోళ్లు తెలంగాణలో వ్యవసాయానికి ఊపిరిపోశాయన్నారు. ప్రజల అభిమానం, ప్రోత్సాహమే పార్టీని ముందుకు నడిపిస్తున్నాయని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
Tags: minister niranjan reddy, trs party farmation day, celabrations, vanaparthi