- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం
దిశ ప్రతినిధి, మేడ్చల్: యాదాద్రి ఆలయానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ విరాళాలను అందజేశారు. స్వామివారి దేవస్థాన విమాన గోపురానికి బంగారు తాపడం చేయడం కోసం మేడ్చల్ నియోజకవర్గం నుంచి సేకరించిన ఒక కోటి 83 లక్షల రూపాయాలు(మూడున్నర కిలోల బంగారం విలువ) మంత్రి మల్లారెడ్డి గురువారం ఆలయ కార్యనిర్వాహణ అధికారికి అందజేశారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సమయంలో 125 కేజీల బంగారం విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు గురువారం ఉదయం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఘట్ కేసర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో భారీ ర్యాలీతో యాదాద్రి చేరుకుని విరాళాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్‌చార్జి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి మహేందర్ రెడ్డి, నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.