కేటీఆర్‌కు ఊహించని షాక్.. కాన్వాయ్‌‌ని అడ్డుకున్న బీజేవైఎం నేతలు(వీడియో)

by Shyam |   ( Updated:2023-12-14 14:35:28.0  )
KTR, BJYM leaders
X

దిశ, మహేశ్వరం: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధి తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈ-సిటీ సోలార్ సెల్ 750 డబ్యూ కంపెనీ ప్రారంభానికి వస్తోన్న కేటీఆర్ కాన్వాయ్‌ను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హుజురాబాద్‌ దళితులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరితో పాటు పేదలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాన్వాయ్ అడ్డుకున్న వారిలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదిష్, రాకేష్, పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed