- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
23న నీరా కేఫ్‌కు శంకుస్థాపన
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ కు ఈనెల 23న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన, సభ కార్యక్రమాల ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం పర్యవేక్షించారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా నీరా పాలసీని సీఎం ప్రవేశపెట్టారన్నారు. గౌడ్ల ఆత్మగౌరవ భవనానికి కోకాపేటలో ఎంతో విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. నీరా కేఫ్ కోస నెక్లెస్ రోడ్డులో ఎంతో విలువైన స్థలాన్ని కేటాయించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐదారు నెలల్లో పూర్తి చేసి నీరా కేఫ్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.