భారీ వర్షాలు.. సమస్యలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి : కేటీఆర్

by  |
KTR twitter
X

దిశ తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ర్ట వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైద‌రాబాద్‌లో కూడా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ ( Disaster Response Force ) బృందాలు, ఇత‌ర అధికారులు ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను ప‌ర్యవేక్షిస్తున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో స‌మ‌స్యలు ఎదురైతే.. 100కు లేదా 040-29555500 నంబ‌ర్లకు కాల్ చేయాల‌ని న‌గ‌ర పౌరుల‌ను కేటీఆర్ కోరారు.

బుధవారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి నాగోల్‌ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్ల వ‌ర్షపాతం న‌మోదు కాగా, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్‌ మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వ‌ర్షపాతం నమోదైంది. ఇక, చేగుంటలో అత్యధికంగా 227.5 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed