అభివృద్ధిని చూసి మద్దతివ్వండి :కేటీఆర్

by Anukaran |   ( Updated:2020-11-23 05:06:08.0  )
అభివృద్ధిని చూసి మద్దతివ్వండి :కేటీఆర్
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో ఆరేళ్లలో అభివృద్ధిని గమనించి మద్దతివ్వండని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‎లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఐదో జనరల్ బాడీ సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓట్లడిగే హక్కుందని స్పష్టం చేశారు. సామాన్యుడి కోసమే ధరణి పోర్టల్‌, తదితర సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు.

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వారందరినీ ఆదరిస్తున్నామని మంత్ర కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలిరోజుల్లోనే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఏపీలో కలిపారని, దీంతో సీలేరు ప్లాంట్ ఏపీకి వెళ్లడంతో కొంత విద్యుత్‌ ఉత్పత్తిని కోల్పోయామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని.. టీఆర్ఎస్ కు వేస్తే సంతోషమన్నారు మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాకే పరిమితం కాకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

Advertisement

Next Story