- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డి ఆరోపణలో నిజముంది : కేటీఆర్
దిశ, శేరిలింగంపల్లి: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఈటల రాజేందర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని మండిపడ్డారు. సాగర్‌లో బీజేపీ డమ్మీ అభ్యర్థి నిలిపిందని, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో కూడా ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించారు. జాతీయ పార్టీలు టీఆర్ఎస్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయని, వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ రూ.50 కోట్లు తీసుకొని పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి అమ్ముకున్నారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారని, వాటిని నేటి వరకు ఖండించలేదని, అయితే ఆరోపణల్లో నిజం ఉన్నది వాస్తవమే కదా అని అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఈనెల 25న నిర్వహిస్తున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ప్లీనరీకి వచ్చే ప్రతినిధులంతా ఉదయం 10 గంటలకే హెచ్ఐసీసీకి చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే పాసులు కూడా అందజేసినట్లు చెప్పారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులంతా గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ఏడు తీర్మానాలను చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు విధిగా సమయపాలన పాటించాలన్నారు. ప్లీనరీకి 6500 మంది ప్రతినిధులు హాజరవుతారని, వారందరికీ ప్రాంగణంలోనే భోజన వసతి ఏర్పాటు చేశామని, ప్రాంగణం బయట మరో 4 వేల మందికి భోజన సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పేర్లను నమోదు చేసుకోవడానికి 35 కౌంటర్లు ఏర్పాటు చేశామని, 50 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేటీఆర్ వెంట ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ, కృష్ణారావు, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, శంభీపూర్ రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.