హైదరాబాద్ లో వరదలకు నేను ఒక్కడినే బాధ్యుడినా..?- మంత్రి కేటీఆర్

by Shyam |   ( Updated:2021-09-04 05:03:28.0  )
హైదరాబాద్ లో వరదలకు నేను ఒక్కడినే బాధ్యుడినా..?- మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆశయం, ఆలోచన, పట్టుదల ఉంటే దేనినైనా విజయవంతం చేయవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పీస్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా స్పర్శ్ హాస్పీస్ అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అభినందనీయమన్నారు. ఆరోగ్య పరమైన సమస్యలను ఆలోచిస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందజేస్తామని వెల్లడించారు. స్పర్శ్ హాస్పిస్ కు ప్రాపర్టీ టాక్స్, వాటర్ బిల్లు మినహాయింపు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉంటుందన్నారు. ప్రతి రోజు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటామని వాటిలో కొన్నింటిలో మాత్రమే ఆత్మసంతృప్తి కలుగుతుందని, సంయమనం, సంస్కారం, ఔదార్యం ఉండాలన్నారు. హైదరాబాదులో వర్షాలకు, వరదలకు నేను ఒక్కడినే బాధ్యుడిని కాదు అని స్పష్టం చేశారు. చివరి ఘడియల్లో ఓదార్పు అవసరమని అది ఇస్తే వారు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయేష్ రంజన్, రఘునందన్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆనంద్, మహేష్ త్యాగి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story