- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాన్షును కించపరిచిన తీన్మార్ మల్లన్న.. కేటీఆర్ ఫుల్ సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్నపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు హిమాన్షు బాడీ షేమింగ్‌పై నెట్టింట్లో తలెత్తిన ప్రశ్నపై ఆయన మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ యూ ట్యూబ్ చానల్‌లో ‘అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా’ అని వేసిన ప్రశ్నపై కేటీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ అయ్యారు.
‘ఫ్యామిలీ మెంబర్ మీద ఇంత దిగజారి పోల్స్ పెడుతుండు ఈ మల్లి గాడు, మీరు చూస్తూ కూర్చోండి అన్నా’ అంటూ ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేయగా.. దీనిపై మంత్రి స్పందించి ఫుల్ సీరియస్ అయ్యారు.
ఇక మంత్రి కేటీఆర్ ఇదే ట్వీట్ పై స్పందిస్తూ జేపీ నడ్డాకు స్ట్రాంగ్ మెసేజ్ ట్యాగ్ చేశారు. ‘తెలంగాణలో బీజేపీ నేతలకు మీరు నేర్పేది ఇదేనా..? బీజేపీ నేతల నీచమైన రాజకీయ వ్యాఖ్యల్లో నా కొడుకును లాగి, బాడీ షేమింగ్ చేయడమే మీ సంస్కారమా..? మీరు ఆలోచించలేదా.. మేము కూడా ఇటువంటి వ్యాఖ్యలు మోడీ, అమిత్ షా ఫ్యామిలీ మీద చేయగలమా..? దయచేసి ఈ థర్డ్ రేట్ నాయకులు, బీజేపీ అనుకూల మీడియా నా పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేయకండి. మేము చట్టపరమైన చర్య తీసుకోవలసి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో ప్రతిస్పందింస్తాం. అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Sri @JPNadda Ji,
Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?
You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v
— KTR (@KTRTRS) December 24, 2021
At times I wonder whether it’s worth being in public life; especially in today’s social media times where anyone can say anything without an iota of shame or proof
And dragging kids into this cesspool of YouTube channels that dish out 24/7 nonsense in the guise of journalism
— KTR (@KTRTRS) December 24, 2021