కరీంనగర్‌లో అంతా ఏకపక్షమే.. ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ ధీమా

by Sridhar Babu |
కరీంనగర్‌లో అంతా ఏకపక్షమే.. ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ ధీమా
X

దిశ, కరీంనగర్ సిటీ : రానున్న కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, టి.భాను ప్రసాద్ రావు ఎన్నిక ఏక పక్షమే అని మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, గంగుల కమలాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు రిసార్ట్ లో సిరిసిల్ల, కరీంనగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ఈ నెల 10 న జరుగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులు కేటీఆర్, గంగుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్.రమణ, టీ భాను ప్రసాద్ రావులు ఘన విజయం సాధిస్తారని, దాంట్లో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు క్రాస్ ఓటింగ్ జరిగి గెలుస్తామని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 994 ప్రజాప్రతినిధుల బలముందని ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపై ఉన్నారని, వారంతా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. ప్రత్యర్ధులది దింపుడు కళ్ళెం ఆశ అని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి నిరాశ తప్పదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ గంగుల తో పాటు ఉ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఉ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎల్.రమణ, టీ భాను ప్రసాదరావు, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed