- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఐటీ పాలసీ ప్రకటించిన కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: సెకండ్ ఐటీపాలసీలో 2026 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతుల టార్గెట్ రూ.3 లక్షల కోట్లు అని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల హెచ్ఐసీసీలో నాస్కామ్ చైర్మన్ రేఖ మీనన్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, యూఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రిఫ్ మెన్ తో కలిసి సెకండ్ ఐటీపాలసీ(2021-2026)ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2026 నాటికి ప్రత్యక్షంగా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం ఏడేండ్లలో దాదాపు రెట్టింపయిందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నారు. 2013-14లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2020-21 నాటికి రూ.లక్షా 45 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో అత్యున్నత ఐదు కంపెనీలు గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఎయిటెల్, మైక్రోసాప్ట్ హైదరాబాద్‌లో తమ ఆఫీస్‌లను ఏర్పాటు చేశాయన్నారు. వీటితో పాటు సేల్ ఫోర్స్, స్టేట్ స్ట్రీట్, పెప్సీకో, డీబీఎ్, ఫియట్, జడ్ఎఫ్, ఊబర్, నీడెడ్, ఎఫ్-5, తదితర అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
పెట్టుబడులకు, స్టార్టరఫ్ లకు తెలంగాణ మొదటి చాయిస్‌గా మారిందని, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అన్నారు. టెక్నాలజీ ఆధారిత పాలనకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని, డ్రైవింగ్ లెసెన్స్ టెస్ట్ కూడా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 1500 స్టార్టప్‌లకు సహాయం అందించామని, టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి పైగా నిపుణులను తయారు చేశామన్నారు. ఐదు వందలకు పైగా ప్రభుత్వ సేవలు మీ సేవ ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 5 లక్షల మందికిపైగా డిజిటల్ ఎడ్యుకేషన్ అందించామన్నారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి రూ.13 వందల కోట్లతో 8వేల స్టార్టప్‌లను పోత్సహిస్తున్నామని తెలిపారు. ఐదేళ్ల ఐటీ పాలసీని సరికొత్త ఆలోచనలు, విధానాలతో రూపొంచినట్లు వెల్లడించారు. ఇన్వెస్టర్లకు, పారిశ్రామిక వేత్తలందరికి ఆహ్వానం పలుకుతన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెయింట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్ రెడ్డి, మీసేవా కమిషనర్ వెంకటేశ్వర్ రావు, సీపీ స్టీఫెన్ రవీంద్ర, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, రమాదేవి, రుద్రకుమార్, రాం ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.