- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉర్దూ అకాడమీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉర్దూ అకాడమీకి ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రభుత్వం రూపొందించింది. కోర్సులకు సంబంధించిన వివరాలతో పాటు ఉర్దూ కోర్సులకు దరఖాస్తులు ఆన్ లైన్ లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. గురువారం హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉర్దూ అకాడమీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో అకాడమీని విద్యార్థులకు చేరువ చేసేందుకు వెబ్ సైట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. మార్పులకు అనుగుణంగా అకాడమీలో మార్పులు చేస్తుండటం అభినందనీయమన్నారు. ఆన్ లైన్ కోర్సులు ప్రవేశ పెట్టడం కూడా ఇందులో ఒక భాగమన్నారు.
తెలంగాణ ఉర్దూ అకాడమీ సెక్రటరీ
డాక్టర్ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ వెబ్ సైట్ www.urduacademyts.com లో వివరాలు సమయానుసారం అప్ డేట్ చేస్తున్నామని వివరించారు. ఆన్ లైన్ లో దరఖాస్తులకు వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ అన్నారు. ఆన్ లైన్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ దరఖాస్తుతో పాటు సంబంధిత డాక్యుమెంట్ల తో ఉర్దూ అకాడమీ, 4వ అంతస్తు, నాంపల్లిలోని హజ్ హౌస్ లో పోస్టులో పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణ, అతావుల్లా , షేక్ ఇస్మాయిల్ , ముబీన్ జేబేదీ, మహ్మద్ జునేదుల్లా బేగ్, రాజ్జబ్ అలీ పాషా, ఆథర్ ఖాన్, ఇస్మాయిల్, జావీద్, మహమ్మద్ రఫీ, ఫసీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.