‘మా నాన్న, నేను గుడివాడలోనే పుట్టాం’

by srinivas |
Minister Kodali Nani
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రెండోవిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడ నియోజకవర్గంలో 43 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలిచారని మంత్రి కొడాలి నాని తెలిపారు. అంతేగాకుండా ‘మా నాన్న నేను గుడివాడలోనే పుట్టాం. అంతేగానీ యలమర్రులో వైసీపీ మద్దతుదారులు ఓడిపోతే నాకేంటి. నాకు సంబంధం లేని ఊర్లో వైసీపీ ఓడిపోయిందని కొన్ని పత్రికలు రాసాయి. యలమర్రులో నేను అభ్యర్థిని నిలబెట్టానని ప్రచారం చేస్తున్నారు. యలమర్రులో నేను ఓట్లు అడిగినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని నాని స్పష్టం చేశారు. యలమర్రు గ్రామంలో తమ పూర్వీకులు ఉండేవారని వెల్లడించారు.

Advertisement

Next Story