‘చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి’

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ బిల్లులు కట్టలేదని రైతులకు చంద్రబాబు బేడీలు వేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గతంలో బషీర్‌బాగ్ లో రైతుల పై కాల్పులు జరిపించారని కన్నబాబు మండిపడ్డారు. అంతేకాకుండా.. ఆయన హయాంలో ఏలూరులో రైతుల పై లాఠీ చార్జీ చేయలేదా అంటూ ప్రశ్నించారు.

గత ఐదేళ్లు అధికారంలో ఉండి ఉచిత విద్యుత్ పై చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ కోసమే సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. కేవలం పగటి పూటే 9 గంటల విద్యుత్ ఇచ్చేందుకు జగన్ కృష్టి చేస్తున్నారని కొనియాడారు. అలాగే, ఏపీలో అనధికారిక కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం అంటూ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

Advertisement