- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన విధానానికి శ్రీకారం చుట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
దిశ, నల్లగొండ: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు భరోసా కల్పిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటికే వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులను పంచే నూతన విధానానికి మంత్రి శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. చివ్వేంల మండల కేంద్రంలో కొండ పద్మతో పాటు అదే మండలంలోని అక్కలదేవి గూడెం గ్రామానికి చెందిన కొంగర నాగలక్ష్మిలకు మంత్రి స్వయంగా వారి నివాసాలకు వెళ్లి చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ పథకం బాలికల పాలిట వరం లాంటిదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కల్యాణ లక్ష్మీ పథకానికి కేసీఆర్ సంకల్పమే జీవనాడి అని, రైతులపై చిత్తశుద్ధి కేసిఆర్‌కు మాత్రమే ఉందన్నారు. మంత్రి వెంటా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణగౌడ్, జెడ్పీటీసీ సంజీవ్ నాయక్, ఎంపీపీ రాణి, సుధాకర్ రెడ్డి, ఆర్డీవో మోహన్ రావ్, తహశీల్దార్ సైదులు తదితరులు ఉన్నారు.