- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కంటతడి పెట్టిన మంత్రి జగదీశ్‌రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన వెళ్లిన తర్వాత.. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులు, మంత్రి జగదీశ్‌రెడ్డి కలిసి మీడియాతో మాట్లాడారు. సంతోష్‌బాబు తల్లి మంజుల మాట్లాడుతున్న సమయంలో తీవ్ర ఉద్వేగానికి గురైన మంత్రి జగదీశ్‌రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం తాను మాట్లాడుతూ సంతోష్‌బాబు భార్య సంతోషిని గ్రూప్ వన్ స్థాయి అధికారిగా నియమిస్తూ ఉత్వర్వులు ఇచ్చామని తెలిపారు. సంతోష్‌బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు, సంతోషికి రూ.4కోట్ల చెక్కును అందజేశామని, హైదరాబాద్‌లో ఇంటి స్థలం కావాలని అడిగితే బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించామన్నారు. సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో సంతోష్‌బాబు విగ్రహం పెట్టి, ఆ ప్రాంతానికి జవాన్‌గా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: సంతోషి
ఎలాంటి సాయం కావాలన్న చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారని సంతోష్‌బాబు భార్య సంతోషి అన్నారు. గ్రూప్ వన్ కేడర్‌లో జాబ్ ఇచ్చి, ఇష్టమొచ్చిన శాఖలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 711 గజాల స్థలం కేటాయించారని, కేసీఆర్ తమ ఇంటికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు.
కొండంత దైర్యం వచ్చింది: సంతోష్‌బాబు తల్లిదండ్రులు
సీఎం కేసీఆర్ మా కుటుంబాన్ని ఓదార్చి మాట్లాడుతూ మీ అబ్బాయిని అయితే తీసుకురాలేం కానీ, ఏ సాయం కావాలన్న చేస్తామని హామీ ఇచ్చారని సంతోష్‌బాబు తల్లి మంజుల తెలిపారు. ఇవాళే కాదు ఎప్పటికీ తోడుగా ఉంటామని సీఎం చెప్పడంతో మా కుటుంబానికి కొండత దైర్యం వచ్చిందన్నారు. మాతో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుతో ఆయన గొప్పతనం అర్థమైందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ తానై ముందుండి చూసుకున్నారని పేర్కొన్నారు.