ప్రతి ఆస్పత్రిలో ధరల పట్టిక కంపల్సరీ : మినిస్టర్

by vinod kumar |
Minister Jagadish Reddy
X

దిశ, భువనగిరి: స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని, దానికి ఏమాత్రం భయాందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, మెడికల్, హెల్త్, డ్రగ్ కంట్రోల్, టాస్క్‌ఫోర్స్, ఐఎంఏ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ అనితారామచంద్రన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అన్నారు. లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలు సహకరిస్తున్నారు అని తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున, అందుకు తగ్గట్టుగా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా ఇంజెక్షన్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం రవాణా వేగవంతం చేయాలి యాసంగిలో ధాన్యం రైతు చేతికి విరివిగా వచ్చిందని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి సకాలంలో కేంద్రాల నుంచి తరలించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed