చెట్లకు నీళ్లు పట్టిన మంత్రి

by Shyam |
చెట్లకు నీళ్లు పట్టిన మంత్రి
X

దిశ, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటి సంరక్షణలో ప్రజలందరూ పాలుపంచుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మొక్కలకు మంత్రి స్వయంగా నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు రావాలన్నారు. మనిషి జీవితం పర్యావరణంతో ముడిపడిఉందని, అలాంటి పర్యావరణం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని పర్యవణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యతగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటినారన్నారు. ప్రస్తుతం పర్యావరణ రూపంలో ప్రపంచ దేశాలు అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట మున్సిపాలిటీలో వాటర్ డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed