- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి.. వాళ్ల దగ్గర మోకరిల్లారు’
దిశ, నల్లగొండ: విద్యుత్‌శాఖ మత్రి జగదీశ్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతల జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం హాలియాలో నిర్వహించిన నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ నాయకులేనని, ఆనందంగా జరుపుకోవాల్సిన రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను ధర్నాలు, దీక్షలు చేసి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహుగా మిగిలారని తెలిపారు. నల్లగొండ రైతులు ఆగం అయ్యింది.. కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే అని మంత్రి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకులదేనని, పదవుల కోసం సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయిన నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులదని మండిపడ్డారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డిలు అందరూ సీమాంధ్ర నాయకుల వద్ద మొకరిల్లి నల్లగొండ జిల్లాను ఎండబెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలు, డ్రామాలు, ధర్నాలు ప్రజలెవ్వరూ నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. సాగర్ ఎడమ కాలువ కింద మొదటి మేజర్ అయిన రాజవారం మేజర్ కింద చివరి భూములకు నీళ్లు ఇవ్వలేని చేతకాని వారు కాంగ్రెస్ నేతలని చెప్పారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పాపం కాంగ్రెస్ నాయకులదేనని, ఎక్కడ లేని, వినియోగించని టీబీఎం మెషిన్‌ను తెప్పించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వేందుకు పెట్టి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్ర చేశారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ద్వంద వైఖరిని విడనాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.