- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంట మార్పిడితో లాభాలు
by Shyam |
X
దిశ, నల్లగొండ: పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు వరి పంటపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని.. మిర్చి, కందులు, పెసర వంటి పంటలనూ సాగు చేయాలన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి పేరు మీద రైతు వేదిక నిర్మించడం హర్షణీయమన్నారు. ఎలాంటి పంటలు పండించాలి? ఏ పంటలు వేస్తే లాభాదాయకంగా ఉంటుంది తదితర సలహాలు తెలుసుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఆర్డీఓ కిషోర్, హుజూర్ నగర్ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మఠంపల్లి జడ్పీటీసీ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story