- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏర్పాట్లపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.
సోమవారం కలెక్టరేట్‌లో కోవిడ్-19పై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అర్బన్ హెల్త్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ టెస్టులతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. వైద్య సిబ్బంది నియామకానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు.
అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రాణాంతక వ్యాధి నుండి కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.