- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నీరా కేఫ్' నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘నీరా కేఫ్’ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో నీరా పాలసీని రూపొందించి గీతా కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నీరా, వాటి అనుబంధ ఉత్పత్తుల అమ్మకాల కేంద్రం ‘నీరా కేఫ్’ కోసం హుస్సేన్ సాగర్ వద్ద నెక్లెస్ రోడ్డులో నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులను వేగవంతం చేయాలని కోరారు.
వచ్చే నవంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వీటితోపాటు యాదాద్రి – భువనగిరి జిల్లాలోని నందన వనంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత నీరా ఉత్పత్తి, నీరా అనుబంధ ఉత్పత్తుల అధ్యాయన కేంద్రం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నీరా కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.