బాపూజీ ఉద్యమాలే ఊపిరిగా బతికాడు : మంత్రి

by Aamani |
బాపూజీ ఉద్యమాలే ఊపిరిగా బతికాడు : మంత్రి
X

దిశ, నిర్మల్: బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వర్ధంతిని నిర్మల్ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…

వెనకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి రాజకీయంగా, సామాజికంగా ఎంతో ఎదిగారని తెలిపారు. ఉద్యమాలే ఊపిరిగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని కొనియాడారు. ఆయన విలక్షణ జీవితశైలి అందరికీ ఆదర్శం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని అన్నారు.

Advertisement

Next Story