- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారికి సకాలంలో… రుణాలు అందించండి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లాలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద అర్హులైన అందరికీ రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రుణాల మంజూరుపై బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అర్హులైన చిరు వ్యాపారులకు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో రుణాలు అందించాలన్నారు. జిల్లాలో ఎక్కువ మందికి లబ్దిచేకూరేలా అధికారులు, బ్యాంకర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ మాట్లాడుతూ… బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు అర్హులైన అందరికీ వెంటనే రుణాలను మంజూరు చేయాలన్నారు. అనంతరం బ్యాంకుల వారీగా రుణ లక్ష్యాలు, ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తులపై చర్చించారు.