- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఇండస్ట్రీకి తీరని లోటు : ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపి, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. తన పాటలతో ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానులను అలరించిన ఎస్పీ బాలు గొంతు మూగబోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఎస్పీ బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా కేవలం తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్రపరిశ్రమకు విశేష సేవలందించారని ఆయన సేవలను కొనియాడారు. భారతీయ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించడమే కాకుండా పలు జాతీయ పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు పలు సందర్భాల్లో నంది అవార్డులు అందుకున్నారని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.