‘లోకల్స్‌’ విహారయాత్ర టైం.. సెండ్ ఆఫ్ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు

by Shyam |   ( Updated:2021-11-30 08:58:01.0  )
‘లోకల్స్‌’ విహారయాత్ర టైం.. సెండ్ ఆఫ్ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు
X

దిశ‌,న‌ర్సాపూర్‌ : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లాలో రాజ‌కీయం ఒక్కసారిగా వేడెక్కింది. న‌ర్సాపూర్, మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిల‌ర్లు మంగ‌ళ‌వారం విహార యాత్రకు త‌ర‌లివెళ్లారు. శివ్వంపేట మండ‌లం చాక‌రిమెట్ల స‌హ‌కార ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్రత్యేక పూజ‌లు చేసి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 6 బ‌స్సుల‌లో బయలు దేరారు. రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హ‌రీశ్ రావు, న‌ర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మ‌ద‌న్‌ రెడ్డి, మెద‌క్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కార్పొరేష‌న్ చైర్‌పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌రై వారికి వీడ్కోలు ప‌లికారు.

శిబిరానికి వెళ్లిన వారిలో మొత్తం 169 మంది ఉన్నారు. మెద‌క్‌, న‌ర్సాపూర్‌, తూఫ్రాన్‌, రామాయంపేట‌కు చెందిన మున్సిప‌ల్ చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు, కౌన్సిల‌ర్లు, జిల్లాలోని ఆయా మండలాల‌కు చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో క‌ర్నాట‌క రాష్ర్టంలోని బెంగుళూరుకు కొంత మందిని, గోవాకు కొంత మందిని త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed