దసరా కల్లా సిద్ధం చేయండి: హరీశ్‌రావు

by Shyam |
దసరా కల్లా సిద్ధం చేయండి: హరీశ్‌రావు
X

దిశ, సిద్దిపేట: దసరా కల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ పునర్నిర్మాణ పనులను మంత్రి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నిర్మాణ దశల్లో ఉన్న ఎవరి ఇళ్లను వారికే కేటాయింపు చేయాలని ఏంపీడీవో సమ్మిరెడ్డిని మంత్రి ఆదేశించారు.

చింతమడక మజరా గ్రామమైన దమ్మచెరువు, ఎస్సీ కాలనీలో గ్రామ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అంకంపేట, సీతారాంపల్లిలోని ఎస్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, తహశీల్దార్ పరమేశ్వర్, ఏంపీడీఓ సమ్మిరెడ్డి, గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story