- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ గద్దె దిగే వరకు పోరాటం ఆపవద్దు.. మంత్రి హరీష్ రావు
దిశ ప్రతినిధి, మెదక్, గజ్వేల్: రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దే దిగాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గజ్వేల్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన బీజేపీ నేతలను నిలదీయాలి. వడ్లు కొంటరా.. కొనరా అని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పంట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని బీజేపీపై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు తొలిగిపోయాయన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పటికే 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా నగదుగా ఇచ్చామన్నారు. ఈ నెల 28 నుండి యాసంగి రైతు బంధు డబ్బులు జమ చేస్తామన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమి లేదని, రైతు వ్యతిరేక బీజేపీకి గుణ పాఠం చెప్పాలన్నారు. బీజేపీ రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేస్తోందన్నారు. మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో ఒప్పించాలని హితవుపలికారు. బీజేపీ గద్దె దిగే వరకు పోరాటం ఆపవద్దని కార్యకర్తలకి పిలుపునిచ్చారు.