- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి గుడ్‌న్యూస్.. కీలక హామీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
దిశ, జమ్మికుంట : కొందరు బొట్టు బిల్లలు, గోడ గడియారాలు, కుంకుమ భరిణలు ఇస్తున్నారట.. వాటికి ఆకర్షితులై మోసపోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం హుజురాబాద్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. కోటి 25 లక్షల వడ్డీలేని రుణాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఏడేళ్ల కాలం పాటు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఒక్క మహిళా సంఘం భవనం కూడా కట్టించలేదన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు భవనాలు కట్టిస్తామని, ప్రస్తుతం 4 భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, నేను.. మా నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి గృహప్రవేశం చేయించామని, ఇక్కడ మాత్రం ఒక్కరికీ కూడా గృహప్రవేశం చేసిన దాఖలాలు లేవని.. ఇది ఎవరి నిర్లక్ష్యమో మీకు తెలుసునని మంత్రి అన్నారు.
ఇదంతా అడిగినందుకే నన్ను లేనిపోని మాటలతో తిడుతున్నారని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. మీ ఇంట్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కుల, మతాలకు అతీతంగా ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
గతంలో పెళ్లి కూతురు పేరిట చెక్కులు అందజేస్తే.. ఆ డబ్బులు అత్తింటి వారికి వెళ్తున్నాయని తెలిసి, ఇప్పుడు పెళ్లి కూతురు తల్లికి అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. పట్టణంలోని సైదాపూర్-బోర్నపల్లి రోడ్డు అధ్వానంగా మారడంతో రోడ్డు మరమ్మత్తు కోసం రూ.6 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెంటిమెంటు డైలాగులు కొట్టేవాళ్ళు మనకు వద్దని, ప్రజలకు పనులు చేసే వాళ్ళు, మన కష్టాలను తీర్చే వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో సొంతంగా స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.