- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : హరీష్ రావు
దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాల కేసుల నమోదు పెరుగుతున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నుండి జిల్లాకు చెందిన మెదక్ ఎంపీ, ఎం ఎల్ సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్స్, కమిషనర్‌లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీజనల్ వ్యాధులపై సమాచారం, బాధితులకు వైద్య సేవల వివరాలను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులను మంత్రి టెలీ కాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 14 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ తెలిపారు. చికెన్ గున్యా, మలేరియా కేసులు నమోదు కాలేవని తెలిపారు.
వైరల్ ఫీవర్ కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయన్నారు. సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలన్నారు. అందుకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యశాఖను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని, వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీలలో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి అని ఆదేశించారు.
ప్రజల భాగస్వామ్యంతో మున్సిపాలిటీలలోనీ అన్ని వార్డులలో రేపు (ఆదివారం) ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్లు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక డ్రైవ్‌లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలి అని ఆదేశించారు. ఎంపీ, ఎంఎల్‌సీ ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌లో భాగస్వామ్యమై వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం నుంచి వైరల్ జ్వరాలు తగ్గే వరకు అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్‌గా డ్రైవ్ చేపట్టాలన్నారు. వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. అలాగే పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఐఆర్ఎస్, ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. దోమల నివారణ, లార్వా వృద్ధిని అరికట్టేందుకు పట్టణాల లోని అన్ని చెరువులు, కుంటల్లో విస్తృతంగా ఆయిల్ బాల్స్ ను వేయాలన్నారు. డెంగ్యూ మలేరియా జ్వరాల నివారణ పట్ల ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ ముగిసే వరకు వైద్యాశాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా వుంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలని మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు.