‘ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే.. మానవ మనుగడ ప్రశ్నార్థకం’

by Shyam |
‘ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే.. మానవ మనుగడ ప్రశ్నార్థకం’
X

దిశ, మెదక్: భూమండలంలో అన్నింటి కంటే విలువైనది ప్రకృతి అని, జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యవరణంపై ఆధారపడి ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన సందేశాన్ని ఇచ్చారు. మొక్కలు లేక పోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకం అవుతుంది అని.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ప్రకృతిపై దృష్టి పెడుతున్నాయని, ప్రతిఒక్కరూ మొక్క నాటి, సంరక్షించే బాధ్యత చేపట్టాలని చెప్పారు.. సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంలా చేపట్టాలని, కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు వ్యాధుల వస్తున్నాయన్నారు. చెట్లను పెంచడం.. అడవులను సంరక్షించడం.. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి, పర్యావరణపై బోధించాలని ప్రతివిద్యార్థితో మొక్క నాటించాలని పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెప్పారు.

Advertisement

Next Story