- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీశ్‌రావు ఆపరేషన్ ఆకర్ష్.. వాళ్లే టార్గెట్ ..!
దిశ, సిద్దిపేట: యువత దేశానికి గొప్ప ఆస్తి. దేశాభివృద్ధిలో వారి పాత్ర కీలకం. అందుకే స్వామి వివేకానందుడు యువతను దేశ సంపదగా వర్ణించాడు. వారు తల్చుకుంటే సాధించని ఏదీ ఉండదు. యువతను నిర్లక్ష్యం చేస్తే దెబ్బతినడం ఖాయం. అందుకే ఈ విషయం అన్ని పార్టీలకూ బాగా బోధపడుతోంది. ముఖ్యంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్‌కు బాగానే కనువిప్పు కలిగించాయి. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువతపై టీఆర్ఎస్ ఫోకస్ పెరిగింది. ఎప్పుడు జనంలో ఉండి, జనానాయకుడిగా పేరొందిన ఓ ప్రజాప్రతినిది యూత్ టార్గెట్ గా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.. క్రీడలే లక్ష్యంగా యువతను కార్యోన్ముఖులను చేస్తూ విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధి… ఏమిటా కథా వాచ్ ‘దిశ’ స్పెషల్ స్టోరీ..
యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారంటారు. వారిలో మార్పు రావాలంటారాయణ ! ఇంత కీ ఎవరాయన అనుకుంటున్నారా? ఆయనే సి ద్ది పేట అభివృద్ధి ప్రదాత, మంత్రి హరీశ్ రావు. కొంతకాలంగా మంత్రి హరీశ్ రావు యువతపై బాగా ఫోకస్ పెట్టారు. వారిని చదువుతో పాటు క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. క్రీడలను ప్రోత్స హిస్తూ.. క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందు లో భాగంగానే సిద్దిపేటలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్వి మ్మింగ్ ఫుల్, మినీ, ఇండోర్ స్టే డియాలు ఏర్పాటు చేశారు. సి ద్దిపేటను విద్యాక్షే త్రంగానే కాకుండా పర్యాటక క్షే త్రంగా, క్రీ డా హబ్ గా మారుస్తున్నారు.
ప్రతి సిక్సర్‌కు రూ. 1000 నజరానా..
ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీలు ఇక్కడి మైదానాల్లో నిర్వహించడం గమనార్హం. ఇదే అదునుగా స్థానిక యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు పలు టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. మొన్న రంగనాయకసాగర్ ప్రాజెక్టు కట్టపై సైక్లింగ్ పోటీలు నిర్వహించగా, ఇటీవల సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ పోటీల్లో పట్టణంలోని 60 టీములు, దాదాపు 800 మంది క్రీడాకారులు పాల్గొంటుడడం విశేషం. యువత ఉత్సాహానికి హరీశ్ ప్రోత్సాహం సిద్దిపేటలో క్రీడలకు మరింత ఊపు తెస్తోంది. సీఎం కేసీఆర్ కప్‌లో ప్రతి సిక్సర్‌కు రూ. వెయ్యి నజరానాను ప్రకటించారు. దీంతో ఈ క్రీడలకు మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రతీ యువకుడు ఆల్ రౌండర్ కావాలని హరీష్ పిలుపునిస్తున్నారు. క్రీడలను సీరియస్‌గా తీసుకుంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చుని, మన హైదరాబాద్ కే చెందిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి సాధారణ ఆటో డ్రైవర్.. అయినా తాను అహర్నిశలు శ్రమించి ఇండియా జట్టుకు ఎంపికై జట్టును గెలిపించాడని యువతలో ఉత్సాహం కల్పిస్తున్నారు.
చేయి దాటకుండా జాగ్రత్తలు
ఒక వైపు సిద్దిపేట యువతను చదువు, క్రీడలు, ఉపాధి, అభివృద్ధి వైపు మల్లిస్తూనే మరోవైపు వారు తన చేయి దాటకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మున్సిపాల్స్ ముంచుకొస్తున్న తరుణంలో పార్టీకి యువతను దగ్గర చేస్తున్నారు. ఒక వైపు రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకూ ఎదుగుతుండడం, ఆ పార్టీకీ యువతే ఆయువుపట్టుగా మా రడం తెలిసిందే.. మరోవైపు దుబ్బాక, జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమికి యువతే ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి హరీశ్ రావు యువతపై ఫోకస్ పెట్టారని చర్చ జరుగుతోంది. మొత్తం మీద మంత్రి హరీశ్ రావు క్రీడా మంత్రం.. యువతకు ఏ మేరకు గాలం వేస్తుందో చూడాలి.