- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యసేవలు, గన్నీబ్యాగులు, ఈ ఆహార్ యాప్‌పై మంత్రి రివ్యూ..
దిశ, మెదక్ :
వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఓపికగా సేవలందించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు చూడాలన్నారు.సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్యాధికారులు కాశీనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సిద్ధిపేట ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవల అంశంపై సిద్ధిపేట ఐఏంఏ ప్రతినిధులు, వైద్యులు సతీష్, శంకర్ రావు, శ్రీనివాస్‌లతో మంత్రి సమీక్ష జరిపారు.కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవల గురించి జిల్లా కలెక్టర్, ఐఏంఏ ప్రతినిధులు చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలు నిరంతరం ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, రోగులకు అందించే సేవల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఐఏంఏ ప్రతినిధులకు మంత్రి వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఓపీ సేవలందించే వారని, ప్రస్తుతం ఓపీ సమయాన్ని మరో గంట అదనంగా పెంచినట్టు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు గన్నీ బ్యాగులు తేవాలి..
రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందుకు తమ వద్దనున్న పాత గన్నీ బ్యాగులు ఉంటే తెచ్చుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాంతో కలిసి పట్టణ లింగారెడ్డి పల్లి పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులు టార్పాలిన్ కవర్లు,గన్నీ బ్యాగులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం గ్రామాల్లోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఆ సమయంలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
కరోనా కట్టడికి ఇర్షాద్ హుస్సేన్ రూ.30వేల విరాళం..
కరోనా వైరస్ కట్టడికి యువజన విభాగం అధ్యక్షుడు ఇర్షాద్ హుస్సేన్ రూ.30వేల విరాళం ప్రకటించారు. ఆ చెక్కును మంగళవారం మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. అంతేకాకుండా పట్టణంలోని 100 మంది నిరుపేదల సహాయార్థం రూ.70 వేల విలువ కలిగిన 100 నిత్యావసర వస్తువుల కిట్స్‌ను మంత్రికి అందించినట్టు ఇర్షాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్వరూప్, ప్రణీత్ పాల్గొన్నారు.
ఆన్ లైన్‌లో నిత్యావసరాలు..
లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయల సరఫరా చేసేందుకు నూతన టెక్నాలజీతో తయారైన ‘ఈ ఆహార్’ యాప్‌ను మంత్రి హరీష్ రావు మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ రూపకర్త మహ్మద్ సభిని మంత్రి అభినందించారు.ఈ యాప్ ద్వారా నిత్యావసరాలు పంపిణీ విజయవంతమైతే దీనిని జిల్లా వ్యాప్తంగా అమలులోకి తేవాలని సమీక్షలో మంత్రి వెల్లడించారు.
Tags: carona, lockdown,medical service, gunny bags, minister harish rao, online vegetables supply