- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల గతాన్ని గుర్తు చేసిన ట్రబుల్ షూటర్
దిశ సిద్దిపేట: సర్పంచ్, ఎంపీటీసీగా అనుభవం లేకున్నా సీఎం కేసీఆర్ చొరవతోనే ఈటల రాజేందర్ రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యారని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్‌హాల్లో హుజురాబాద్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈటల గతం చెప్పిన మంత్రి..
కమలపూర్‌లో 2004లో ఎమ్మెల్యే టికెట్ కోసం 20 మంది ఉద్దండులు పోటీ పడ్డా.. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌కు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. నాడు మంత్రిగా ఉన్న దామోదర్ రెడ్డితో రాజేందర్ పోటీ పడగా ఆయన గెలుస్తాడా అని అందరూ అనుకున్నారని.. కానీ, టీఆర్‌ఎస్ జెండా, సీఎం కేసీఆర్ చరిష్మాతో రాజేందర్ విజయం సాధించడం జరిగిందన్నారు. నాడు టీఆర్‌ఎస్ పార్టీ జెండాతో గెలిచిన రాజేందర్ నేడు బీజేపీలోకి వెళ్లి.. జెండా చూడొద్దు నా ముఖం చూడాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆత్మగౌరవం పేరిట నాటకాలు..
ఆత్మ గౌరవం పేరిట నాటకాలు ఆడుతున్న రాజేందర్.. నేడు గడియారాలు, కుట్టుమిషన్లు, మిక్సర్లు ఎందుకు పంచాల్సి వస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రభుత్వంలోనే ఉంటూ.. ప్రభుత్వం పై విమర్శలు చేసిన ఘనత రాజేందర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ రెండు సార్లు మంత్రిగా, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యునిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టాలని చూస్తోన్న రాజేందర్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా.. సప్పుడు చేయకుండా ఎందుకు ఉండాల్సి వచ్చిందని రాజేందర్‌ను మరోసారి నిలదీశారు మంత్రి హరీశ్ రావు.