- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డంప్‌యార్డ్‌లో లంచ్ చేసిన హరీశ్‌రావు
దిశ, మెదక్: చెత్త ఉంటే దుర్వాసన అంటూ ముక్కు మూసుకుని ఆమడ దూరం పోతాం. కానీ ఇందుకు భిన్నంగా మంత్రి హరీశ్ రావు వ్యవహరించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఏకంగా డంప్ యార్డులో ప్రజా ప్రతినిధులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. డంప్ యార్డ్‌లో వచ్చే దుర్గంధంతో ఒక్క క్షణం కూడా నిలబడని చోట సహపంక్తి భోజనాలు చేసి ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ లను వినియోగంలోకి తేవాలని ప్రజాప్రతినిధులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
సిద్దిపేటలోని మిడిల్ ట్రాన్స్‌పోర్ట్ డంప్ యార్డు, పొడి వ్యర్థ వనరుల సేకరణ కేంద్రం, వార్డు స్థాయి సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలను సోమవారం మధ్యాహ్నం నంగునూరు మండల ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఒకరోజు పూర్తిగా డంప్ యార్డుకే సమయాన్ని కేటాయించి, రానున్న రోజుల్లో తమ గ్రామాల్లో కూడా డంప్ యార్డులో వర్మీ కంపోస్టు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పట్టణంలోని 4వ మున్సిపల్ వార్డులో సేకరించిన చెత్తను కంపోస్టుగా మారుస్తున్న తీరుతెన్నుల గురించి వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.