గుమిగూడిన జనం.. హరీష్ రావు ఆగ్రహం

by Shyam |
గుమిగూడిన జనం.. హరీష్ రావు ఆగ్రహం
X

దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం లాక్ డౌన్ చేస్తున్నా.. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో కలెక్టర్‌తో సమీక్షా సమావేశం ముంగిచుకుని వస్తున్న మంత్రి హరీష్ రావు.. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలు పోగై ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే కాన్వాయ్‌ను ఆపిన మంత్రి.. ఏం జరుగుతోందని ఆరా తీశారు. వీరంతా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులని, ఊర్లలోకి వెళ్లేందుకు ఎఓసీల కోసం వచ్చారని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుంపులుగా ఉండొద్దని చేస్తున్న ప్రయత్నానికి విరుద్ధంగా సమూహాలుగా ఉండటం ఏంటని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

tag: Harish Rao, outraged, police station, lockdown, students, patancheru

Advertisement

Next Story

Most Viewed