- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎక్సలెంట్ బ్యూటిఫికేషన్‌గా ఉండాలి: హరీశ్‌రావు
దిశ, సిద్ధిపేట: కొత్త కలెక్టరేట్ అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామశివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి పరిశీలించారు.
కలెక్టరేట్ భవనంలోని కార్యాలయాల సుముదాయాల గదులను బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలిస్తూ.. కలెక్టరేట్ కలియ తిరిగారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అత్యాధునిక సదుపాయాలతో ప్రజల సౌలభ్యం కోసం సౌకర్యార్థం నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రామ రెడ్డి వివరించారు. ఈ మేరకు పలు అసంపూర్తి నిర్మాణ పనులపై ఆరా తీసి క్యాంటీన్, కలెక్టరేట్ ఆవరణలో హరితహారం సుందరీకరణ చేసి ఎక్సలెంట్ బ్యూటిఫికేషన్ వచ్చేలా.. సుందరంగా తీర్చిదిద్దాలని అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించారు. మిగులు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.