- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తేనే ప్రజాసేవ చేసినట్టు…..
దిశ,సిద్దిపేట:
రైతులు, ప్రజల ఆదాయాభివృద్ధి పెరిగేలా సేవ చేసినప్పుడే నిజమైన ప్రజాసేవ చేసిన వారవుతారని ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటలోని శ్రేష్ట ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను, వర్షాలకు ఇండ్లు కూలిపోయిన వారికి నష్ట పరిహారం చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విత్తనోత్పత్తి పని చేస్తే రైతు ముఖంలో ఆనందం, సంతోషం చూస్తామని అన్నారు. అదే తన కోరిక అని మంత్రి చెప్పుకొచ్చారు. మిల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కర్ణాటక, ఏపీ చింతలపూడిలో కీరదోస ద్వారా రెండు నెలల వ్యవధిలో ఎకరం పంటకు 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు మిగులుతున్నాయని అన్నారు. అలాంటి పంటల సాగుపై రైతులకు చైతన్యం కలిగించాలని స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా. ప్రజల వద్దకే అధికారులు వచ్చి చెక్కుల్ని, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.