- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవే మా ప్రచారాస్త్రాలు
దిశ, పటాన్ చెరు:గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ది, సంక్షేమ పథకాలే తమ పార్టీ ప్రచారాస్త్రాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం భారతీనగర్ తెరాస కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మెదక్ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచారాస్త్రాలని అన్నారు.
బీజేపీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఏడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని బీజేపీ చెప్పిందన్నారు. ఆరున్నరేండ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిందన్నారు. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందన్నారు. ఈ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్జారు.
ప్రతిష్టాత్మకమైన బీహెచ్ఈఎల్ మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పడు ఎనిమిది శాతం కన్నా ఎక్కువ జీడీపీ వృద్ధి రేటు ఉంటే, బీజేపీ దాన్ని మైనస్ ఇరవై నాలుగు శాతానికి తీసుకెళ్లిందన్నారు. దీని వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఈ విషయాలన్నీ తెరాస కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్లి వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు.