సూర్యకిరణాలు ఒంటిమీద పడేట్టు చూసుకోవాలి

by Shyam |   ( Updated:2020-07-30 06:06:51.0  )
సూర్యకిరణాలు ఒంటిమీద పడేట్టు చూసుకోవాలి
X

దిశ, గజ్వేల్: ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పేది ఆడపిల్లల పెండ్లి భారం కాకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశంలోనే ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని, కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే అమలు చేసిందని అన్నారు. కాగా గజ్వేల్ నియోజకవర్గ రూ.3 కోట్ల 4 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిందన్నారు. కషాయం తాగండి కరోనాను రూపుమపండి అని పిలుపునిచ్చారు. ఆర్వీఎం ఆసుపత్రి, సిద్దిపేటలో కరోనా ఐసోలేషన్ హాస్పిటల్ అందుబాటులో వున్నదన్నారు. ఉదయం పూట వచ్చే సూర్య కిరణాలు మనమీద పడేటట్టు చూసుకోవాన్నారు. సంత్రాలు, బత్తాయిలు, ఆకుకూరలు, కూరగాయలు, తినాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బూమ్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed