గ్రీన్ జోన్‌లో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు: హరీశ్‌రావు

by Shyam |
గ్రీన్ జోన్‌లో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు: హరీశ్‌రావు
X

దిశ, మెదక్: సిద్దిపేట గ్రీన్ జోన్‌లో ఉందని.. ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముఖానికి మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారన్నారు. సిద్ధిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ అరుంధతి కల్యాణ మండపంలో శనివారం గ్యాదరి బాలరాజు జ్ఞాపకార్థం.. కరుణకాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల కిట్స్‌ను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500 రూపాయలను అందించామని, రెండో దశలోనూ రూ.1500 చొప్పున అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ‘‘ మనకు కరోనాతో సహ జీవనం తప్పేట్టు లేదు. అందరి సహకారంతో కరోనాను ఎదుర్కొందాం. సామాజిక దూరాన్ని పాటించాలి’’ అని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిద్దిపేట కరోనా ఫ్రీ జిల్లా అయిందని, ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌‌కు సహకరించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.

Tags: minister harish rao, siddipet, corona, green zone, daily needs distribution

Advertisement

Next Story

Most Viewed