కిషన్ రెడ్డిది రెండు నాల్కల ధోరణి :హరీష్ రావు

by Anukaran |
కిషన్ రెడ్డిది రెండు నాల్కల ధోరణి :హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధర చెల్లించి.. కొనుగోలు చేయాలని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా మొక్కజొన్న కొనాలని నిర్ణయించుకున్నాం.. కానీ, కేంద్రం నిర్ణయంతో మొక్కజొన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎమ్ఎస్పీ లేఖను వెనుకకు తీసుకోండని హరీష్ రావు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 87.64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story