ఎల్లుండే హుజూరాబాద్‌లో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్.. హరీష్ రావు, సీఎస్ పరిశీలన

by Sridhar Babu |   ( Updated:2021-08-14 03:54:53.0  )
Minister Harish Rao, CS Somesh Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన హుజురాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి దళితబంధును లాంచ్ చేయనున్నారు. దీంతో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించేందుకు హెలికాప్టర్‌లో మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్‌లు హెలికాఫ్టర్‌లో కరీంనగర్ వెళ్లారు. అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్‌తో పాటు స్థానిక మంత్రి గంగుల కమలాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Advertisement

Next Story