ఢిల్లీలో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటన

by srinivas |   ( Updated:2020-09-10 10:02:36.0  )
ఢిల్లీలో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటన
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో డేటా సెంటర్​ ఏర్పాటుకు సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిసి ‘డిజిటల్ ఇండియా’ పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సచివాలయం తరహా ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరారు. గత 14నెలల్లో రాష్ట్రాన్ని డిజిటలైజేషన్‌కు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

అనంతరం కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్‌సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయతో సమావేశమయ్యారు. ‘సాగరమాల’ పథకం కింద కాకినాడ పోర్టులో వసతుల కల్పనకు సహకరించాలని విన్నవించారు. ‘భారతమాల’ కార్యక్రమంలో భాగంగా పోర్టుల చుట్టూ జాతీయ రహదారుల అనుసంధానంపై చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed