పుట్టా మధు వ్యవహారంపై గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు

by Sridhar Babu |
Minister Gangula kamalakar
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన మంత్రి గంగుల మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, క్యాడర్ మొత్తం పార్టీతోనే ఉందని వెల్లడించారు. వ్యక్తులు పోయినంత మాత్రానా పార్టీకి ఎలాంటి నష్టం జరుగదని అన్నారు. కేసీఆర్ ఫోటోనే టీఆర్ఎస్ గెలుపు మంత్రం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే దీనికి నిదర్శనమన్నారు. పట్టణాలు, పల్లెల్లోనూ ముఖ్యమంత్రిపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదు. మరో 20 సంవత్సరాల వరకు కేసీఆర్‌ ముందు ఏ శక్తి నిలబడదన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు విచారణకు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed