ముస్లింలు సహకరించారు… హిందువులూ సహకరించాలి

by Sridhar Babu |
ముస్లింలు సహకరించారు… హిందువులూ సహకరించాలి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వినాయక చవితిపై రాజకీయాలు చేయొద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నఆయన మాట్లాడుతూ.. అన్ని పండగలూ తమకు సమానమే అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రజలంతా పండుగలను ఇంట్లోనే జరుపుకుంటున్నారని గుర్తు చేశారు.

అన్ని మతాల పండుగలను గౌరవిస్తామన్న మంత్రి గంగుల రాజకీయ కోణంలో మాట్లాడితే పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వినాయకచవితిని ప్రజలు ఇండ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు మట్టి విగ్రహాలనే పూజించాలని, కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.

ఆరోగ్య తెలంగాణ, హరిత తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఈ సారి వినాయకచవితి ఇళ్లలోనే జరుపుకుని కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ సందర్భంలో ముస్లింలు సహకరించారని, వినాయక చవితి సందర్భంగా హిందువులు సహకరించాలని కోరారు. ఈ అంశాన్నికొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని, మండపాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించడం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed