- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొటున్నాం: ఈటల
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు, పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న కరోనా సేవలపై మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేకంగా కొవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నామని, లక్ష మంది కరోనా పేషంట్లకు చికిత్స అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. పేషంట్లకు అన్ని సదుపాయాలు అందేలా చూడాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అవసరమయిన పేషంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ప్రతి పేషంట్‌నీ బ్రతికించాలని, ఐసీయూపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఐసీయూలో ప్రస్తుతం 30మంది పేషంట్లు ఉన్నారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ మంత్రికి వివరించారు. ఆస్పత్రి అంతా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, గాంధీ ఆస్పత్రికి 80వెంటిలేటర్స్ అందించామని, వీటితో అత్యవసర పరిస్థితిలో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పేర్కొన్నారు.