నాగ‌లి పట్టి దుక్కి దున్ని..

by Shyam |
నాగ‌లి పట్టి దుక్కి దున్ని..
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు అవతారమెత్తాడు. మంగళవారం దేవాదుల కాలువలను పరిశీలించేందుకు పాదయాత్ర చేపట్టిన ఆయన పొలంలో నాగలి పట్టి దుక్కి దున్నారు. జిల్లాలోని సంగెం మండలం రాంచంద్రాపురం చేరుకున్న ఆయన చేలల్లో పనిచేస్తున్న రైతులను గమనించి అక్కడే కాసేపు ఆగి వారితో ముచ్చటించారు.ఈ క్రమంలోనే రైతుల‌తో క‌లిసి చెర్న‌కోలాతో కొద్దిసేపు నాగ‌లి పట్టిన మంత్రి, ఆపై పొలంలో వేరుశ‌న‌గ విత్త‌నాలు చ‌ల్లారు. అంతకు ముందు ఎర్రబెల్లి నాగలి దున్నుతుండగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి విత్తనాలు చల్లారు. ఆ తర్వాత రైతులకు మాస్కులు పంపిణీ చేసి, క‌రోనా నేప‌థ్యంలో భౌతిక దూరం పాటించాలని సూచించారు.పని సమయంలో, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధ‌రించాల‌ని, స్వీయ నియంత్ర‌ణ‌తోనే క‌రోనా మహమ్మారిని గెల‌వగలమని వివరించారు. ఈ పాదయాత్రలో మంత్రి వెంట వ‌రంగ‌ల్ ఎంపీ పసునూరి ద‌యాక‌ర్, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, రైతులు, అధికారులు, ఆయా గ్రామాల ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed