- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ప్రతినిధి, వరంగల్ : ఆలయాల దగ్గర కాదు.. అఫిషియల్‌గా కూర్చుని అభివృద్ధిపై చర్చిద్దాం రండి అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అనేక అంశాల్లో నెంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలే వాటిని గుర్తించి కొనియాడాయని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ఉనికిని చాటుకునేందుకు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై అధికారుల సమక్షంలో నివేదికలతో అఫిషియల్‌గా చర్చిద్దామని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ప్రతీ విషయానికి మతం రంగు పూసి ప్రజలను మోసం చేయాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసి.. కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తోందని చెప్పి దబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో నిర్లక్ష్యం వహించడం వల్లే తాము ఓటమిని చవి చూశామని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ ఎక్కువసీట్లలో విజయం సాధించిందని వివరించారు.